రోడ్డు మీద ఫోన్ చూస్తే  ఫైన్ - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డు మీద ఫోన్ చూస్తే  ఫైన్

October 25, 2017

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మన పక్కన ఏం జరుగుతోంది,ఎవరున్నారు, అని పట్టించుకోకుండా, అసలు ప్రపంచంతో సంబంధంలేకుండా బ్రతుకుతున్నారు చాలామంది. కొందరైతే రోడ్లపై నడిచేటప్పుడు, ఎదురుగా వచ్చే వాహనాలను కూడా గమనించకుండా మొబైల్ మైకంలో మునిగితేలుతారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ప్రమాదానికి గురి అవుతారు కూడా. అందుకే అమెరికాలోని  హువాయి రాష్ట్రంలోని ఓ నగరంలో రోడ్డుపై నడిచేటప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను చూస్తే భారీ జరిమానా విధించేందుకు సిద్ధమయ్యింది అక్కడి ప్రభుత్వం.

ఎవరైనా నడిచేప్పుడు ఫోన్‌ చూస్తూ కన్పించారో వారికి 15 నుంచి 99 డాలర్ల జరిమానా విధిస్తారు. రోడ్డుపై నడిచే సమయంలో మొబైల్ చూస్తున్నట్లు చిక్కిన ప్రతిసారీ రెట్టింపు జరిమానా ఉంటుంది. ప్రజల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈమధ్య అమెరికాలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2016లోనే 5,987 మంది రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది రోడ్డుపై వస్తున్న వాహనాలను గమనించకపోవడంతో ప్రమాదాల బారినపడ్డారు. దీనికి ప్రధాన కారణం ఫోన్లు వాడడమే అని తేలడంతో ఈకఠిన చట్టాన్ని అమలు పరుస్తోంది అక్కడి ప్రభుత్వం.