మ్యాగీలో మళ్లీ బూడిద - MicTv.in - Telugu News
mictv telugu

మ్యాగీలో మళ్లీ బూడిద

November 29, 2017

రెండు నిమిషాల్లో రెడీ’ అంటూ అందరినీ ఆకట్టుకున్న మ్యాగీలో మళ్లీ బూడిద బయటపడింది. గతంలో ఒకసారి బూడిద మోతాదు ఎక్కువ ఉండడంతో మ్యాగీని రద్దు చేశారు. ఆతర్వాత మళ్లీ నాణ్యత ప్రమాణాలతో మార్కెట్లోకి  కొత్త స్టాక్‌ను తీసుకొచ్చారు.

అయితే తాజాగా మ్యాగీ నూడుల్స్ పై పరీక్షలు చేయగా, బూడిద మోతాదు ఎక్కువుందని తేలింది.  దీనితో ఉత్తర్‌ప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌ జిల్లా అధికారులు నెస్లే ఇండియాకు రూ.45 లక్షలు, వాటిని మార్కెటింగ్ చేసిన ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లకు రూ.15 లక్షలు, ఇద్దరు అమ్మకం దారులకు  రూ.11లక్షలు జరిమానా విధించారు. లెక్కకైతే తినే పదార్థాలలో ఒక శాతం వరకు బూడిద ఉండటానికి అనుమతి ఉంది. అయితే  మ్యాగీలో నిబంధనలకు విరుద్ధంగా 2.6శాతం వరకు బూడిద ఉన్నట్లు  అధికారులు గుర్తించారు.