నారాయణ కాలేజీకి రూ.50 లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణ కాలేజీకి రూ.50 లక్షల జరిమానా

December 13, 2017

విధ్యార్థుల మరణాలకు కారణమైన కాలేజీలపై ప్రభుత్వాలు కన్నెర చేయడం మొదలు పెట్టాయి. తిరుపతిలోని నారాయణ ఐఐటీ కాలేజీకి రూ.50 లక్షల జరిమానా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించింది. ఈ విషయాన్ని విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాస్ రావ్ వెల్లడించారు. అంతేకాదు ఒకవేళ జరిమానా కట్టకపోతే కాలేజీ లైసెన్స్‌ను రద్దు చేస్తామని ప్రభుత్వం సదరు కాలేజీని హెచ్చరించింది.

అసలేం జరిగింది ?

తిరుపతిలోని నారాయణ కాలేజీ హాస్టల్‌లో హర్షవర్థన్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు హర్షవర్ధన్ ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మరి కారణం ఏంటో తెలీదు కాలేజీ హాస్టల్ లో ఉరివేసుకుని చనిపోయాడు.

ఈవిషయం తెలుసుకున్న హర్షవర్థన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. హర్ష ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు అంటున్నారు. కాలేజీ యాజమాన్యంతో పాటు లెక్చరర్ల ఒత్తిడి ఎక్కువగా ఉందని, తట్టుకోలేక పోతున్నట్లుగా తరచుగా తమ కొడుకు  చెప్పేవాడని హర్ష తండ్రి శ్రీధర్‌బాబు మీడియాకు తెలిపారు. మంచి ర్యాంకు సాధించాలని యాజమాన్యం తెస్తున్న ఒత్తిడే.. హర్ష ఆత్మహత్యకు దారి తీసి ఉండవచ్చునని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. హర్షవర్ధన్ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన ప్రభుత్వం నారాయణ కాలేజీకి రూ.50 లక్షల జరిమానా విధించింది.