5 వేల జరిమానా.. సంచుల్లో పట్టికెళ్లి చుక్కలు చూపాడు..   - MicTv.in - Telugu News
mictv telugu

5 వేల జరిమానా.. సంచుల్లో పట్టికెళ్లి చుక్కలు చూపాడు..  

December 8, 2018

ప్లాస్టిక్ వస్తువుల దుకాణంలో పురపాలక శాఖ ఆకస్మిక సోదాలు చేసింది. నిషేధిత వస్తువులు ఉన్నాయని గుర్తించి అధికారులు షాపు యజమానికి రూ.5000 జరిమానా విధించారు. ఇది అతని నచ్చలేదు.  ప్లాస్లిక్ కవర్ల నిండా చిల్లర తీసుకెళ్లి జరిమానా చెల్లించాడు. దీనికి కంగుతిన్న అధికారులు చేసేదేమీ లేక చిల్లరనంతా లెక్కపెట్టి తీసుకున్నారు. అందులో చెల్లించాల్సిన దానికి మరో రూ.70 రూపాయలు తక్కువ ఉండటంతో అది కూడా చిల్లర రూపంలోనే చెల్లించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వసాయిలో చోటు చేసుకుంది.

అమిత్ మోహ్లా  చిరు వ్యాపారి. ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతూ.. జీవనం సాగిస్తున్నాడు. అయితే దుకాణంలో నిషేధిత వస్తువులు ఉన్నాయని పురపాలక శాఖ అధికారులు అతడికి రూ. 5000 జరిమానా విధించింది. దీంతో అమిత్ మొత్తం నగదును రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలను తీసుకెళ్లి అధికారులకు జరిమానా చెల్లించాడు.

దీనిపై పురపాలక శాఖ సహాయ కమిషనర్ సుఖ్‌దేవ్ దర్వేశి మాట్లాడుతూ.. ‘  జరిమానా విధించిన మొత్తం నగదు నాణేల రూపంలో చెల్లించాడు. అది చూసి మేము ఆశ్చర్యపోయాం. చిల్లర మొత్తం తీసుకొని అతనికి రసీదు ఇచ్చాం. ఆ చిల్లర మొత్తం లెక్కపెట్టడానికి 45 నిమిషాలు పట్టింది’ అని పేర్కొన్నారు.