ఫిరంగి తో ఫుల్ లెంగ్త్ హీరో అవనున్న స్టాండప్ కమెడియన్... - MicTv.in - Telugu News
mictv telugu

ఫిరంగి తో ఫుల్ లెంగ్త్ హీరో అవనున్న స్టాండప్ కమెడియన్…

August 26, 2017

‘ కామెడీ నైట్స్ విత్ కపిల్ ’ అన్నా ‘ ది కపిల్ శర్మా షో ’ అయినా మనల్ని విశేషంగా ఆకట్టుకునే స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మానే. అతని టైమింగ్ పంచెస్ నవ్వుల్ని పూయిస్తాయి. ఆ షో అశ్లీలతకు తావు లేకుండా క్లీన్ గా సాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే బుల్లితెర స్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కపిల్ వెండితెర మీద ఎప్పుడు కనిపిస్తాడా అని అతని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య వచ్చిన యశ్ రాజ్ ఫిలింస్ వారి ‘ బ్యాంక్ చోర్ ’ సినిమాలో కపిల్ శర్మానే హీరోగా చేస్తున్నాడని వార్తలు బయటికొచ్చాయి. వై ఫిలింస్ తో అగ్రిమెంటు కూడా అయిపోయాక సంవత్సరం వరకు వారికి డేట్లు ఇవ్వడంలో వెనకడుగు వేసాడు కపిల్.

ఆ వన్ ఇయర్ లో కపిల్ షో చేయకూడదనే వారి నిబంధనను తోసి పుచ్చి సినిమాను వదులుకొని తను షోను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా అతను అటు కపిల్ షోను కొనసాగిస్తూ ఒక సినిమాలో హీరోగా కూడా చేసాడు. ఆ సినిమా పేరు ‘ ఫిరంగి ’ రాజీవ్ ధింగ్రా దర్శకుడు. ఇషితా దత్, మోనికా గిల్ లు తన సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా 10 నవంబర్ 2017 న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా మీద బాలీవుడ్ లో ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. కపిల్ కూడా తన నట విశ్వరూపాన్ని వెండితెర మీద చూస్కోవడానికి చాలా ఎగ్జైట్ మెంటుగా వున్నాడు. అయితే కపిల్ షో నుండి సునీల్ గ్రోవర్ తప్పుకున్నాడు. అతను మళ్ళీ షోలోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అనే సందిగ్ధం కొనసాగింది. కట్ చేస్తే అతను లేకుండానే సోనీ ఛానల్లో షో కంటిన్యూ అవుతోంది. నవజోత్ సింగ్ సిద్దు పంజాబ్ అమృత్ సర్ నుండి పోటీ చేసి ఎంపీగా గెలవడంతో రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. అతని ప్లేసులో అర్చనా పురన్ సింగ్ వచ్చేసింది.

అయితే ఫిరంగి సినిమా తన కెరియర్ కు మంచి ఓపెనింగ్ ఇవ్వాలని సునీల్ గ్రోవర్ తన ట్విట్టర్లో ‘ ఆల్ ది బెస్ట్ ’ అంటూ ట్వీట్ చేసాడు. చూడాలి మరి కపిల్ కు ఫిరంగి సినిమా తన వెండితరంగేట్రానికి ఎంత హెల్ప్ ఫుల్ అవుతుందో. ఆల్ ది బెస్ట్ కపిల్ శర్మా.