అమెరికాలో కరీంనగర్ వాసి హత్య - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో కరీంనగర్ వాసి హత్య

December 15, 2017

అమెరికాలో  తెలంగాణ వాసిపై దుండగులు అకారణంగానే కాల్పులు జరిపారు. అతడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. కరీంనగర్‌కు చెందిన కరేంగ్లే కరుణాకర్ ( 53 ) అమెరికాలోని ఒహియాలోన ఓ మాల్‌లో పని చేస్తున్నాడు. డిసెంబర్ 8 అతనిపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. వెంటనే తేరుకున్న స్ధానికులు కరుణాకర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది.  కాగా కాల్పులకు పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరుణాకర్‌కు భార్య విజయ, కుమారుడు అంకిత్‌ ఉన్నారు. కరుణాకర్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.