mictv telugu

పీఎం నరేంద్ర మోదీ ఫస్ట్‌లుక్ ఇలా..

January 7, 2019

ఎప్పటినుంచో ఊరిస్తున్న ప్రధాని మోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ వచ్చేసింది. ఈ ఫస్టులుక్ పోస్టర్‌ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విడుదల చేశారు. మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ సరితూగుతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఫస్ట్ లుక్‌లో వివేక్ మోదీ పాత్రకు సరిగ్గా సరిపోయాడని బాలీవుడ్ అంటోంది. దర్శకుడు ఒమంగ్ కుమార్ బి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Telugu news First look poster of PM Narendra Modi’s biopic out, Vivek Oberoi stuns

మోదీ స్టైల్లో వివేక్ నిల్చున్నాడు. పోస్టర్ బ్యాక్ డ్రాప్‌లో జాతీయ జెండా రెపరెపలాడగా,  ప్రజలు కనిపిస్తున్నారు. సందీప్ ఎస్ సింగ్, సురేశ్ ఒబెరాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా, సుజన్నా బర్నెట్, అర్జున్ మాథూర్, అభానా కుమ్రా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

Telugu news First look poster of PM Narendra Modi’s biopic out, Vivek Oberoi stuns