తొలిసారి ఎక్కింది  మోదీ కాదు - MicTv.in - Telugu News
mictv telugu

తొలిసారి ఎక్కింది  మోదీ కాదు

December 13, 2017

‘ భారత్‌లో  సముద్ర విమానంలో ప్రయాణించిన తొలి వ్యక్తి  ప్రధాని మోదీ’ అంటూ ఆయన వెబ్‌సైట్ ‘ డబ్లూడబ్లూడబ్లూ. నరేంద్రమోదీ డాట్‌‌కామ్ ’ ఆకాశానికి ఎత్తేసింది నిన్న. అయితే  ముచ్చట అవాస్తవమని తేలింది. కానీ ఈ విషయాన్ని గ్రహించని  టీవీ చానళ్ళు, పత్రికలు తమ పొరపాటును సరిదిద్దుకోలేక పోతున్నాయని పౌర విమానయాన శాఖ మాజీ  ప్రఫుల్‌ పటేల్‌ ట్విట్టర్ ద్వారా మీడియాకు వివరించారు.‘ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘ సీ ఛేంజ్’ను తీసుకు రావాలని మోదీ  భావించారు. అక్కడే ఆయన పెద్ద పొరపాటు చేశారు. వెనకా ముందు ఆలోచించకుండా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోకుండా దేశంలో అన్నిచోట్ల విమానాశ్రయాలను నిర్మించడానికి అనువైన స్థలాలు దొరకవని, అందుకనే పలు చోట్ల సముద్రపు ప్లేన్లను ప్రవేశపెట్టాలని తన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు ’ అని పేర్కొన్నారు.

వాస్తవానికి భారత్‌లో 2010 సంవత్సరంలోనే సీ ప్లేస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2010లో                         ‘జల్‌ హంస’ పేరిట ఈ  సర్వీసులను ప్రారంభించింది. అండమాన్, నికోబార్‌లోని ప్రభుత్వ యంత్రాంగం పవన్‌ హంస అనే సంస్థతో కలిసి ఈ విమాన సర్వీసులను కొంతకాలం నడిపింది. ప్రఫుల్‌ పటేల్‌ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సరైన లాభాలు లేక కొన్ని రోజుల్లోనే ఈ సర్వీసులను ఆపివేశారు. 2013లో ఉమెన్ చాందీ కేరళా ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ ప్రాజెక్టును చేపట్టింది. కానీ మత్స్యకారులు వ్యతిరేకించటంతో ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండానే ఆగిపోయింది.