పెళ్లి తర్వాత తొలిసారి కలిసి.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి తర్వాత తొలిసారి కలిసి..

February 10, 2018

క్రేజీ జంట నాగచైతన్య, సమంత పెళ్ళయ్యాక ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. కనిపిస్తే బావుండనే వారి ఫ్యాన్స్ కోరికను త్వరలోనే నెరవేర్చనున్నారు ఈ జంట. ‘ నిన్నుకోరి ’ సినిమా దర్శకుడు శివ నిర్వాణ వీరిద్దరికీ ఓ కథ చెప్పి ఒప్పించాడట. కథ కూడా వారికి నచ్చటంతో నటించటానికి సుముఖత చూపుతున్నారని సమాచారం. హిందీలో వచ్చిన ‘ 2 స్టేట్స్ ’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రానున్నదంటున్నారు.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయట. పెళ్ళి కాక మునుపు వీరిద్దరు ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో నటించి మెప్పించారు. పెళ్లయ్యాక ఇద్దరూ సినిమాల్లో బిజీగానే కొనసాగుతున్నారు.కాగా ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు, ఈ చిత్రంలో అడవిశేష్ హీరోగా చేస్తున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివానీ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తోందని సన్నిహిత వర్గాల సమాచారం. ఒక సినిమా మీద రెండు విభిన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఏది కార్యరూపం దాలుస్తుందో చూడాలంటున్నారు చైసామ్ ఫ్యాన్స్.