ఏప్రిల్ 5న.. వైసీపీ ఎంపీల రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

ఏప్రిల్ 5న.. వైసీపీ ఎంపీల రాజీనామా

March 12, 2018

‘ప్రజాస్వామ్యంలో పోరాటం ఓ భాగం. ఏపీకి ప్రత్యేకహోదా కోసం మేం అవిశ్రాంతంగా పోరాడతాం.. వైఎస్ జగన్ చెప్పినట్టుగానే మా పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలూ వచ్చే నెల 5వ తేదీన పదవులకు రాజీనామా చేయడం ఖాయం ’ అని వైఎస్పార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.ఉదయం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాము అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయం.. దాన్ని స్వీకరించాలా ? వద్దా ? అన్నది స్పీకర్ నిర్ణయమని అన్నారు. అవిశ్వాసంపై తీర్మానం ప్రవేశపెట్టాలంటే 50 మందికి పైగా ఎంపీలు కలిసిరావాలని అన్నారు. ఈ విషయమై విపక్ష పార్టీలతో చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం వెనుకంజ వేయకుండా తాము చేయగేంతా చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో వివిధ పార్టీలు తమకు మద్దతు ఇవ్వటానికి ముందుకు వచ్చాయని మరో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.  టీడీపీ ఎంపీలు కూడా కలిసి రావాలని, వారిని పవన్ కల్యాణ్ ఒప్పించాలని అన్నారు.