బతికున్న వాళ్ల ఫొటోలపై వేటు - MicTv.in - Telugu News
mictv telugu

బతికున్న వాళ్ల ఫొటోలపై వేటు

October 24, 2017

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ సైన్ బోర్డులు వంటివాటిపై జీవించి ఉన్న వారి ఫొటోలను ముద్రించకూడదని నిషేధం విధించింది..  రాష్ట్ర బహిరంగ స్థలాల చట్టం1959 ప్రకారం ఆ దేశాలు ఇచ్చింది.  బి. తిరులోచన కుమారి అనే మహిళ వేసిన పిటిషన్‌పై ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడానికి కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తన ఇంటి వద్ద ఇలాంటి భారీ ఫ్లెక్సీలను పెట్టడంతో దారి మూసుకుపోయిందని పిటిషనర్ ఆరోపించారు.  కొందరు రాజకీయ నాయకులు తమ ఫొటోలను ఫ్లెక్సీలు, సైన్ బోర్డుల వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని, పేరు రావడంతో కబ్జాలకు పాల్పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.