ఫ్టిప్‌కార్ట్‌పై 9 కోట్ల చీటింగ్ కేసు - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్టిప్‌కార్ట్‌పై 9 కోట్ల చీటింగ్ కేసు

November 27, 2017

ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్, ఆ సంస్థ ఉద్యోగులపై   చీటింగ్ కేసు నమోదు అయింది. బెంగళూరుకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యాపారవేత్త..  బన్సల్ సోదరులు రూ. 9.96 కోట్లు చెల్లించకుండా మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నవీన్ కుమార్‌కు బెంగళూరులో ఓ చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా నవీన్ ఫ్లిప్ కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.  2015 నుంచి 2016 వరకు 14,000 ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్  వస్తువులను సరఫరా  చేశాడు.కానీ ఫ్లిప్ కార్ట్ వాటిలో 1,482 వస్తువులను తిరిగి వెనక్కి ఇచ్చేసింది. మిగతా వాటికి  డబ్బు చెల్లించలేదు.

వాటికి సంబంధించిన టీడీఎస్, షిప్పింగ్ ఛార్జీలు కూడా చెల్లించలేదని నవీన్ తన  ఫిర్యాదులో పేర్కొన్నాడు. వాటి గురించి అడిగితే అన్ని వస్తువులనూ వెనక్కి తిరిగి ఇచ్చేశామని , ఎలాంటి బాకీలు లేవని బన్సల్ సోదరులు చెప్పారట.  బన్సల్ సోదరులతో పాటు ఫ్లిప్ కార్ట్ సేల్స్ డైరెక్టర్,అకౌంట్ మేనేజర్లపైనా కూడా నవీన్ ఫిర్యాదు చేశాడు.