ఫ్లిప్‌కార్ట్ కొత్త భవనం.. సొగసు చూడ తరమా... - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లిప్‌కార్ట్ కొత్త భవనం.. సొగసు చూడ తరమా…

April 9, 2018

ఎలక్ట్రానిక్ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్  బెంగళూరులో అతిపెద్ద నూతన కార్యాలయాన్ని నిర్మించింది. ఎంబసీ టెక్ విలేజీలో ఈ ఆధునాతన వసతులతో దీన్ని తీర్చిదిద్దామని ఫ్లిప్‌కార్ట్ సంస్థ తెలిపింది.  నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్ కంపెనీ కార్యాలయాలన్నింటిని ఈ భవనంలోని మార్చామని తెలిపింది. ‘బెటర్ టు గెదర్’ థీమ్ కింద ఈ భవనానికి అంకురార్పణ చేశారు. కార్యాలయంలో మొత్తం 7,387 మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా, 8.3 లక్షల చదరపు అడుగుల వీస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం 30 ఫోర్లతో ఈ భవనాన్ని నిర్మించారు.

విశాలమైన హాళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, గాలి వెలుతురు సోకే చక్కని ఏర్పాటు ఇందులో ఉన్నాయి. ఉద్యోగులు హాయిగా పనిచేసుకుంటున్నారు. చిన్నపాటి క్రీడా మైదానాలు, లాన్లు కూడా ఉన్నాయి. ‘ఈ భవనం ఏర్పాటుతో మా  నిర్వాహక సామర్థ్యం మెరుగు పడుతుంది. సిబ్బంది-బృందాల మధ్య సమన్వయం అధికమవుతుంది’ అని ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ప్లేస్‌ అధినేత అనిల్‌ గోటేటి తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటుచేసిన కొత్త భవనంలోకి తమ టీమ్‌ను తరలించామని, కొత్త క్యాంపస్‌ ఆపరేషన్స్‌ ప్రారంభమయ్యామని కూడా తెలిపారు. ఈ కార్యాలయాన్ని రూపొందించే సమయంలో ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు, ఐడియాలను స్వీకరించామని గోటేటి తెలిపారు.