శాంసంగ్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు... - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు…

April 11, 2018

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్డ్ శాంసంగ్ ఉత్పత్తులపై ‘శాంసంగ్ కార్నివల్ సేల్ ’ ను ప్రారంభించింది.  స్మార్ట్ ఫోన్లు,ఎల్ఈడీ,టీవీలు,రిఫ్రిజిరేటర్లు,వాషింగ్ మెషిన్లు,మైక్రోవేవ్ ,ఓవెన్లపై భారీ ఆఫర్‌ను ప్రకటిచింది. ఈ సేల్ నిన్న ప్రారంభమై రేపటితో ముగుస్తుంది.

గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌ 4జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్  ధర రూ.16,900 నుంచి రూ.12,900కు తగ్గింది. గెలాక్సీ ఆన్‌5 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.8,990 నుంచి రూ.5,990కు తగ్గింపు చేసింది. గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.9,499కే అందుబాటులోకి తెచ్చింది.గెలాక్సీ జే3 ప్రొ 2జీబీ/16జీబీ వేరియంట్‌ రూ.6,990కే విక్రయం, ఈ ఫోన్‌ అసలు ధర రూ.8,490.

గెలాక్సీ జే7 ఎడ్జ్‌ 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.34,990కు లభించనుంది. గెలాక్సీ జే7 ప్రొ ధర రూ.18,900 నుంచి  రూ.13,800కు తగ్గింది.

అంతేకాకుండా శాంసంగ్‌ ఇతర ప్రోడక్ట్‌లపై కూడా భారీ  డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది. శాంసంగ్‌ 32 అంగుళాల హెడ్‌డీ రెడీ ఎల్‌ఈడీ టీవీ ఈ సేల్‌లో రూ.17,499కే లభిస్తోంది. శాంసంగ్‌ ఫులీ ఆటోమేటిక్‌ 6.5 కేజీల వాషింగ్‌ మిషన్‌ ధర ఎక్స్చేంజ్‌లో రూ.2500  ఉండగా, రూ.15,999 లభించనుంది. రూ.13,972 నుంచి శాంసంగ్‌ రూమ్‌ ఎయిర్‌ ప్యూరిఫైర్స్‌ ధర ప్రారంభమైంది. మైక్రోవేవ్స్‌ రూ.5,999కు అందుబాటులో వచ్చాయి. వీటిపై నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ తగ్గింపునకు గాను కనీసం కొనుగోలు విలువ రూ.5,990 ఉండాలన్న షరతును ఫ్లిప్‌కార్ట్  విధించింది.