లక్డీకాపూల్‌లో పూలతోట - MicTv.in - Telugu News
mictv telugu

లక్డీకాపూల్‌లో పూలతోట

December 13, 2017

‘ హైదరాబాద్ నగరం నడిబొడ్డు అయిన లక్డీకాపూల్ అంద విహీనంగా మారింది.  దాని రూపు రేఖలు మార్చాలని ’ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ ప్రాంతాన్ని ఆధునీకరించాలని పట్టణ జీవవైవిధ్య విభాగం సంచాలకులు దామోదర్ తెలిపారు. అక్కడ వినూత్నమైన పూలతోటను రూపొందిస్తున్నారు. దీంతో లక్డీకాపూల్ ప్రాంతం కొత్త రూపు రేఖలను సంతరించుకోనున్నది.కూడలిలోని పాత పోలీస్‌స్టేషన్‌ స్థలంలో దీనిని ఏర్పాటు చేస్తున్నామని.. తెలుగు మహాసభల నాటికి సిద్ధం చేసేలా కృషి చేస్తున్నామన్నారు. గులాబీ పువ్వు ఆకారంలో ఫౌంటెన్‌, పువ్వు రేకుల్లోంచి నీరు చిమ్ముతున్న దృశ్యం కనిపించేలా ఈ నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. చుట్టూ విభిన్నరకాల పూల జాతి మొక్కలు, గ్రానైట్‌ రాళ్లతో గోడ, రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ ఉంటాయని చెప్పారు. 

గతంలో జీవవైవిధ్య సదస్సు అప్పుడు ఇక్కడ పూలతోటను ఏర్పాటు చేశారు. ఆ తరువాత సరైన నిర్వహణ లేకపోవడంతో పూల మొక్కలు ఎండిపోయి పూర్వస్థితికి చేరుకున్నది. ఇకనుండి నిర్వహణ లోపాల్లేకుండా  పక్కా ప్రణాళికతో ముందుకు వెళతున్నామన్నారు.