50 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ - MicTv.in - Telugu News
mictv telugu

50 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్

March 31, 2018

హాస్టళ్ళలో వుండే విద్యార్థుల అక్కడ బాగా తింటున్నారు.. హాయిగా చదవుకుంటున్నారు అనటానికి వీలు లేదు. అక్కడ పిల్లలకు పెట్టే భోజనం విషయంలో ఆయాలు సరైన పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది. శుభ్రత పాటించకుండా గొడ్లకు పెట్టినట్టు అన్నం పెట్టడం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతోంది. అలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు బాలికల పాఠశాలలో పునరావృతమైంది. మండల కేంద్రంలోని బిసి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని విద్యర్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే ప్రిన్స్‌పల్‌ను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.