రూ. 5కే భోజనం..  కౌన్ బనేగా విజేత పెద్ద మనసు - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 5కే భోజనం..  కౌన్ బనేగా విజేత పెద్ద మనసు

October 3, 2018

బిగ్ బి అమితా బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో  ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’‌. ఈ షోలో విజయం సాధించిన దవీందర్ సింగ్ ఆకలితో అలమటించే వారికి నామమాత్రం ధరకు భోజనం పెట్టి మానవత్వాన్నిచాటుతున్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన దవిందర్ సింగ్ సెప్టెంబర్ 20న ప్రసారమైన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలో రూ.6 లక్షల 40వేలు గెలుచుకున్నాడు.

Amitabh Bachchan Kaun Banega Crorepati Winner Davinder Singh Sale Food For Rs.5

ప్రోగాంలో గెలుచుకున్న నగదుతో దవిందర్ నిరుపేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘ఆప్ కీ సరోయీ’ పేరుతో ప్రతీ శనివారం ఆకలితో ఉన్నవారికి రూ.5లకే ఆహారం అందిస్తున్నాడు.  ఇందుకోసం ఆయన కుటుంబ సభ్యులందరూ శుక్రవారం రాత్రి ఆహారం తయారు చేసి, శనివారం ఉదయం వాటిని వాహనంలో తరలించి, ఐదురూపాయలకే 4రొట్టెలు పప్పు కూడా అందజేస్తున్నారు.