మీరేం దొంగల్రా బాబు...వీళ్ల ఘనకార్యం చూస్తే నవ్వుతారు! - MicTv.in - Telugu News
mictv telugu

మీరేం దొంగల్రా బాబు…వీళ్ల ఘనకార్యం చూస్తే నవ్వుతారు!

February 16, 2018

పాపం వీళ్లెవరో దొంగతనంలో ఇంకా అఆలు, ఇఈలు కూడా సరిగా నేర్చుకోలేదు కావచ్చు…ఎంతో ఆత్రుతగా దొంగతనానికి బయలు దేరారు. కానీ ఏం లాభం  దొంగతనం మాట అటుంచితే వీళ్లు చేసిన పనికి అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారు. చైనాలో ఫిబ్రవరి 14 అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి బయలుదేరారు. మూతికి మాస్కులు, చేతికి గ్లౌజులు అన్ని పకడ్బందీగా ప్లాన్ వేసకున్నారు.
 షాప్ గ్లాస్ డోర్ పగల గొట్టడానికి చేతిలో ఇటుకలను కూడా పట్టుకెళ్లారు. మొదట ఓ దొంగ ఇటుకతో గ్లాస్ డోర్ ను పగల గొట్టాడు. ఇంకో దొంగ ఇటుకను ఇసిరే క్రమంలో మరోదొంగ అడ్డు రావడంతో ఇటుక తగిలి ఒక్కసారిగా కుప్పకూలాడు. దొంగతనానికని  బయలుదేరితే చావు తప్పి కళ్లు లొట్ట పోయినంత పనైంది. వెంటనే దెబ్బతగిలిన దొంగను మరో దొంగ  అక్కడి నుంచి తీసుకెళ్లి పోయాడు. ఈతతంగం అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈవీడియోను చైనా పోలీసులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దొంగల ఘనకార్యాన్ని చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు.