వైన్ తాగితే  ఆందోళన హుష్! - MicTv.in - Telugu News
mictv telugu

వైన్ తాగితే  ఆందోళన హుష్!

February 7, 2018

కల్లు ఆరోగ్యానికి మంచిది అని  మనదేశ శాస్తవేత్తలు కనిపెట్టారు కదా.  ఇక  అమెరికాలోని  న్యూయార్క్ లో ఉన్న మౌంట్ సినాయ్ దవాఖాన రీసెర్చర్లు మాత్రం  వైన్ తాగితే   మంచిదనే  కొత్త విషయాన్ని కనిపెట్టారు.  తక్కువ మోతాదులో వైన్ తీసుకుంటే మనలో ఉన్న డిప్రెషన్ మాయమవుతుందట.డిప్రెషన్ కు ఆసుపత్రిలో చేసే చికత్స కేవలం యాభై శాతం మాత్రమే రిజల్ట్ వస్తుండడంతో  రీసెర్చర్లు  పరిశోధన చేయగా  వైన్ తాగితే  పూర్తిగా డిప్రెషన్‌ను  మాయం చేయవచ్చు అనే విషయాన్ని కనిపెట్టారు. ముందుగా ఈ పరిశోధనను ఎలుకలపై జరిపితే  ఎలుకలకు ఎక్కడా లేని ప్రశాంతత వచ్చినట్లు కనుగొన్నారు.  ద్రాక్షలో ఉండే పదార్థాలు కణాల వాపును తగ్గించడంతో పాటు మొదడులో ట్రాన్స్‌మిషన్ సిగ్నల్స్‌ను  మెరుపరస్తాయని  పరిశోధకులు కనిపెట్టారు.