మొదటిసారి నేను ఒంటరినన్న ఫీలింగ్ కలుగుతోంది - MicTv.in - Telugu News
mictv telugu

మొదటిసారి నేను ఒంటరినన్న ఫీలింగ్ కలుగుతోంది

April 18, 2018

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి విస్తుపోయే పోస్ట్ పెట్టింది. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ పోస్ట్ పెట్టింది. ‘ ఈ జీవితం ఇక చాలు ( enough of the life ) ’ అని పెట్టింది. ఆమె పోస్ట్‌పై చాలా మంది పవన్‌ను సమర్థిస్తూ కామెంట్లు చేశారు.వెంటనే మరో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ‘ ఈ ప్రపంచంలో మొదటిసారి నేను ఒంటరినన్న ఫీలింగ్ కలుగుతోంది. అలా చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు ’ అని పెట్టింది. దీంతో శ్రీరెడ్డి ఇక తన పోరాటానికి ఫుల్‌స్టాప్ పెట్టినట్టేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి. లేకపోతే తన తర్వాతి స్టెప్ ఏంటని అందరూ అనుకుంటున్నారు.