మహిళల్లో కనకమహాలక్ష్మి ఈవిడే - MicTv.in - Telugu News
mictv telugu

మహిళల్లో కనకమహాలక్ష్మి ఈవిడే

November 22, 2017

ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న మహిళల జాబితాలో ప్రముఖ అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్ (22) నిలింది. ఈ జాబితాను ప్రముఖ సంస్థ ఫోర్బ్స్  మేగజైన్ ప్రకటించింది. 2016-2017 మధ్యకాలంలో ఆమె మోడలింగ్ ద్వారా 22 మిలియన్ డాలర్లు (రూ. 143 కోట్లు) సంపాదించినట్టు ఫోర్బ్స్ తెలిపింది. ఎస్టి లాడర్, లా పైరా అడిడాస్ వంటి సంస్థలకు ఆమె మోడలింగ్ చేస్తోంది. అంతేకాక తన సోదరి కైలీ జెన్నర్‌ కలసి కొన్ని టీవీ షోలలో నటిస్తూ  పెద్ద మెుత్తంలో ఆర్జిస్తోంది.గత 15 ఏళ్లగా మెుదటి స్థానంలో ఉంటున్న జిసెల్ బుండ్‌చెన్ రెండో స్థానంలో నిలించింది. ఈ ఏడాదిఆమె సంపాదన 17.5 మిలియన్ డాలర్లు. మూడో స్థానంలో క్రిస్సీ టైజన్ 13.5 మిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 10లో ఉన్న మోడళ్ల సంయుక్త సంపాదన 109.5 మిలియన్ డాలర్లని ఫోర్బ్స్ తెలిపింది.ఈ జాబితాలో ఉన్న మోడళ్లలో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉంటున్నారు.