ప్రియాంకకు అరుదైన గుర్తింపు   - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకకు అరుదైన గుర్తింపు  

November 2, 2017

బాలీవుడ్ నుంచి హలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక చోప్రా దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఫోర్భ్స్ జాబితా ప్రకటించిన ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. టాప్ 100 జాబితాలో 97వ స్థానాన్ని దక్కించుకుంది. జాబితాలో మెుదటి స్థానం  జర్మనీ చానల్సర్ ఏంజెలా మెర్కెల్ దక్కించుకోగా, రెండో స్థానం బ్రిటన్ ప్రధాని థెరిసా మే, తర్వాతి స్థానంలో పారిశ్రామిక వేత్త మెలిండా గేట్స్ ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి  ఐసీఐసీఐ బ్యాంక్ సీఎండీ ఛందా కొచ్చర్, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందర్ షా, హెచ్‌సీఎల్ సీఈవో రోష్ని నాడర్ మల్హోత్ర, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్  శోభన భార్తియాలు ఉన్నారు.ప్రియాంక 2003‌లో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. దాదాపు 40పైగా సినిమాల్లో నటించింది. ‘బేవాచ్’ సినిమాతో హాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఇచ్చిన ప్రియాంక. ప్రస్తుతం అమెరికన్ టీవీ సీరియల్ క్వాంటికో సీజన్ 3‌లో నటిస్తూ హాలీవుడ్ ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. యూనిసెఫ్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిండర్‌గా సమాజ సేవతో చేస్తూ ప్రజలకు దగ్గర అవుతోంది.