కాచిగూడ రైల్వేస్టేషన్లో  సిగరెట్ల స్మగ్లింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

కాచిగూడ రైల్వేస్టేషన్లో  సిగరెట్ల స్మగ్లింగ్

December 15, 2017

హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో భారీగా విదేశీ సిగరెట్లు లభ్యమయ్యాయి.  డీఆర్ఐ అధికారులు సంపర్క క్రాంతి ఎక్స్ ప్రెస్ రైళ్లో సోదాలు చేయగా భారీగా విదేశీ సిగరెట్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.

 

ఈ సిగరెట్లను స్మగ్లర్లు మయన్మార్ నుండి హైదరాబాద్ కు తీసుకు వచ్చినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన సిగరెట్ల విలువ దాదాపు 65.96 లక్షల రూపాయలు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే సోదాలు నిర్వహిస్తుండగా స్మగ్లర్లు  సిగరెట్లను అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.