ఇవి మామూలు ఎద్దులు కావు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇవి మామూలు ఎద్దులు కావు..

April 12, 2018

కొందరు వ్యక్తులు కొంత నిర్ణీత సమయంలో పని చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేస్తుంటారు. మనుషులు తక్కవ సమయంలో ఎక్కువ పని చేయడం చూశాం. కానీ మూగజీవాలు కూడా తక్కవ సమయంలో ఎక్కువ పని చేస్తాయని ఈ రెండు ఎద్దులు నిరూపించాయి.పెద్దకడుబూరు మండలం గంగులపాడు గ్రామానికి చెందిన గొరవ సరసన్న రెండు ఎద్దులు ఆసాధ్యాన్ని సుసాధ్యం  చేసి చూపాయి. అవి రెండు ఎద్దులు రెండు ఎకరాల పొలాన్ని 5 గంటల లోపు నాగలి దున్ని అందరి చేత శభాష్ అనిపించుకున్నాయి. మామూలుగా అయితే ఎకరం పొలం దున్నడానికి 5 గంటల సమయం పడుతుంది. కానీ రైతు నరసన్న ఎద్దులు మాత్రం బుధవారం ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు రెండు ఎకరాల పొలాన్ని దున్నాయి. దీంతో ఎద్దులను గ్రామస్థులు ఊరేగించారు.