mictv telugu

రైలులో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య

January 8, 2019

గుజరాత్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలులో గుర్తు తెలియని దుండగుల చేతిలో గుజరాత్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జయంతీలాల్‌ భానుషలీ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను తుపాకీతో కాల్చి చంపారు. భుజ్‌ నుంచి అహ్మదాబాద్‌ వెళ్లే సజయీ నగరీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాగా వ్యక్తిగత పగతోనే దుండగులు జయంతీలాల్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ లభించిందని తెలిపారు. జయంతీలాల్‌ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేకపోతే దుండగులే కాల్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.Telugu news Former BJP MLA killed onboard Sayaji Nagri Express in Gujaratఆయన గుజరాత్‌ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, అబుదాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశార. ఆయనపై గతంలో అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. జయంతీలాల్‌ తనపై అత్యాచార యత్నానికి  పాల్పడ్డారంటూ సూరత్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా కూడా చేశారు. కాగా, ఈ కేసులో ఆమె భర్త వచ్చి తన భార్య డబ్బు కోసమే ఇదంతా చేసిందని చెప్పడంతో ఈ కేసుపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.