ఇల్లు లేని మాణిక్ సర్కార్ ఎక్కడున్నాడో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

ఇల్లు లేని మాణిక్ సర్కార్ ఎక్కడున్నాడో తెలుసా?

March 8, 2018

సామాన్యుడు ముఖ్యమంత్రి అయి, మళ్లీ సామాన్యుడు అయిన వైనం ఇది. త్రిపుర రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చిన మాణిక్ సర్కార్ అధికారం కోల్పోయారు. ఇప్పుడు తలదాచుకునేందుకు తనకంటూ సొంత ఇల్లు లేక భార్యతో కలసి పార్టీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అగర్తలలో ఉన్న సీపీఎం కార్యాలయంలో రెండు గదుల ఫ్లాట్‌లో భార్య పంచాలి భట్టాచార్జ్‌తో కలసి బస చేశారు.మాణిక్ సర్కార్ సతీమణి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఆమెకు అగర్తలలో ఒక ప్లాట్ వుంది. అందులో ఇల్లు నిర్మించుకోవటానికి బిల్డర్‌కు ఇచ్చారు. అదికాస్త వివాదంలో చిక్కుకోవటంతో వారికి ఉండటానికి నివాసం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి సీపీఎం పార్టీ కార్యాలయంలో వుండటంపై సీపీఎం కార్యదర్శి బిజన్ ధార్ మాట్లాడుతూ.. ‘ పార్టీ కార్యాలయంలో కనీస వసతులు వుంటాయి. దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరమేమీ లేదు. మా నేతల్లో ఎక్కువ మంది నిరాడంబర జీవితాన్ని గడిపినవారే ’ అన్నారు.