mictv telugu

మాజీ క్రికెటర్‌పై హాకీ స్టిక్స్‌తో దాడి

February 12, 2019

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రస్తుత ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోషియేషన్ సీనియర్ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌, భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ అమిత్ భండారిపై అల్లరి మూక దాడికి పాల్పడింది. ఢిల్లీ అండర్‌-23 జట్టులోకి తనను తీసుకోలేదని కక్ష పెంచుకున్న అనూజ్‌ దేడా అనే యువ క్రికెటర్ తన స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ మైదానంలో ప్రాక్టీస్‌ సెషన్‌ను అమిత్ పరిశీలిస్తుండగా.. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్‌ చైన్లతో ఆయనపై దాడి చేశారు.

Telugu News Former Indian cricketer Amit Bhandari thrashed by unidentified men in Delhi.

అమిత్ బండారి పారిపోయేందుకు ప్రయత్నించినా కూడా వెంటాడి మరీ కొట్టారు. వీరి దాడిలో ఆయన తల, చెవి భాగంలో గాయాలయ్యాయి. అనూజ్‌ దేడాను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 2000-2004 మధ్య రెండు వన్డేల్లో భారత జట్టుకు అమిత్ ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. ఈ దాడిని మాజీ క్రికెటర్లు బిషన్‌ సింగ్‌ బేడీ, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌ తీవ్రంగా ఖండించారు.Telugu News Former Indian cricketer Amit Bhandari thrashed by unidentified men in Delhi