చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేసినవారికి చిప్పకూడు తప్పదని ఈ సంఘటన రుజువు చేస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత ఖలీదా జియా (72)కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 21 మిలియన్ టాకాల ( కోటి 61 లక్షల రూపాయలు )ను తనకు చెందిన జియా ఆర్ఫానేజ్ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి పాల్పడినందుకు కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది.ఈ కేసులో ఆమె కొడుకు తారిఖ్ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా సంబంధాలున్నట్టు తేలటంతో వారికి కూడా 10 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ కోర్ట్ తీర్పునిచ్చింది. ఈ తీర్పు వల్ల బంగ్లాదేశ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ అంతటా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.