హెల్మెట్ పెట్టుకోలేదని వ్యాన్ డ్రైవర్‌కు ఫైన్... - MicTv.in - Telugu News
mictv telugu

హెల్మెట్ పెట్టుకోలేదని వ్యాన్ డ్రైవర్‌కు ఫైన్…

December 4, 2017

ట్రాఫిక్ పోలీసుల  పుణ్యాన  ఓ వ్యక్తి మారుతీ హోమినీలో కూడా హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆగ్రా-జైపూర్ రహదారిపై భరత్‌పూర్‌కు చెందిన విష్ణుశర్మ  మారుతీ హోమినీలో వెళుతున్నాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రహ్లాద్ సింగ్ అతన్ని ఆపి  ‘నీ హెల్మెట్ ఏది అని అడిగేసరికి’ విష్ణుశర్మ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

సార్ ఇది ఫోర్ వీలర్, ఫోర్ వీలర్‌కు హెల్మెట్ ఏంటి సార్ అని అడిగినా ప్రయోజనం లేకపోయింది. గదంతా నాకు తెలీదు, హెల్మెట్ పెట్టుకోనందుకు రూ.200 జరిమాన కట్టాల్సిందేనని కానిస్టేబుల్ చెప్పడంతో, ఆయువకుడు ఫైన్ కట్టి అక్కడినుంది వెళ్లిపోయాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే  ఆతర్వాత మళ్లీ ఎక్కడ పోలీసులు ఫైన్ వేస్తారో అని మారుతీ హోమినీలో  హెల్మెట్  పెట్టుకుని తిరుగుతున్నాడు విష్ణుశర్మ.

అయితే  ఫోర్ వీలర్‌లో హెల్మెట్ పెట్టుకోనందుకు  ఫైన్ వేసిన కానిస్టేబుల్‌పై దర్యాప్తు చేసి అతనిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.