సంచలనం.. బస్సులు, రైళ్లలో ప్రయాణం ఫ్రీ.. - MicTv.in - Telugu News
mictv telugu

సంచలనం.. బస్సులు, రైళ్లలో ప్రయాణం ఫ్రీ..

December 7, 2018

యూరప్ ఖండంలోని అతిచిన్న దేశమైన లగ్జెంబర్గ్ కీలకమైన నిర్ణయం తీసుకోనుంది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలోని ప్రజలందరికీ రైళ్లు, బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు సిద్ధమైంది. దీన్ని 2020 నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జేవియర్ బెటెల్ పేర్కొన్నారు. లగ్జెంబర్గ్ దేశానికి బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి ప్రతి రోజూ దాదాపు 2 లక్షల మంది వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. లగ్జెంబర్గ్.. ఈ మూడు దేశాలకు మధ్య ఉండటంతో రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి.

Telugu News Free Public Transport In Luxembourg.. Bus, Metro And Tram Will Not Have to Pay For The Journey, The Government Of Allan Government Of Luxembourg

లక్షలాది మంది ప్రయాణికులు రోజు వారి సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తుండటంతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. అంతేకాదు వాహనాల వల్ల వాయు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీంతో కాలుష్యాన్ని నివారించడంతో పాటు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఈ నిర్ణయం తీసుకుంటుంది.

ఇలా ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తే.. ప్రజలకు ఖర్చు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్య నియంత్రిచొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. టికెట్లు లేకుండా రవాణా సౌకర్యం కల్పిస్తే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ సమస్య పరిష్కరిస్తేనే తాము ఈ నిర్ణయానికి ఒప్పుకోబోమని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రపంచంలోనే ఇలాంటి సౌకర్యం కల్పిస్తున్న తొలి దేశంగా లగ్జెంబర్గ్ రికార్డు సృష్టించనుంది. News Free Public Transport In Luxembourg.. Bus, Metro And Tram Will Not Have to Pay For The Journey, The Government Of Allan Government Of Luxembourg