ఆన్‌లైన్‌లో ‘పశుబజార్’ - MicTv.in - Telugu News
mictv telugu

ఆన్‌లైన్‌లో ‘పశుబజార్’

October 31, 2017

ఊళ్ళల్లో వారం వారం కూరగాయల సంత జరగడం అనాధిగా కొనసాగుతూ వస్తోంది. అందుకు తోడు పశువుల సంత కూడా కొనసాగుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూరగాయల సంతను ఆన్‌లైన్ వేదికపైకి ‘ఈ మార్కెట్’ పేరుతో తీసుకు వచ్చింది. తాజాగా పశువుల అమ్మకాలను, కొనుగోళ్ళను ఆన్‌లైన్‌లో జరపనుంది.  ‘పశుబజార్’ పేరిట ఈ వెబ్‌సైటును రైతులకు అందుబాటులోకి తెస్తోంది. గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు, కుక్కలు.., ఇలా ఏ జంతువునైనా ఆన్‌లైన్‌లో కొనొచ్చు, అమ్మొచ్చు. మాట. ఈ వెబ్‌సైటును పశు సంవర్ధక శాఖ ఆదేశాలమేరకు నిర్వహిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నది.  

రైతులు చాలా సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశుబజార్‌లో క్రయ విక్రయాలు చేపట్టవచ్చు. ఇందులో దళారులు దండుకునే అవకాశమే వుండదు. మోసాలు అస్సలు వుండవు. యజమానులు మొదటగా http://pashubazar.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత అందులో సేల్ (అమ్మకం) ఎనిమల్, పర్చేజ్( కొనుగోలు ) ఎనిమల్ అనే ఆప్షన్లు ఉంటాయి. విక్రయించే రైతులు సేల్‌ ఎనిమల్ ఆప్షన్‌లోకి వెళ్లి అందులో యజమాని పేరు, జిల్లా, మండలం, జంతు రకం, వయసు, ఎన్ని జంతువులు, ప్రస్తుత పరిస్థితి, ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి, అలాగే యజమాని ఫోన్ నెంబరుతో సహా.. ప్రాంతం, నిర్ణయించిన ధరను నింపి జంతువు ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఈ వివరాలన్నింటితో ఓటీపీ నెంబర్‌కు పంపిస్తే మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. కొనుగోలు చేయాలనుకునే వ్యక్తి పర్చేజి ఎనిమల్ ఆప్షన్‌లోకి వెళితే అందులో ఏ రకమైన జంతువు కావాలో.. ఆ వివరాలు సబ్మిట్ చేస్తే కావల్సిన సమాచారం ముందుంచుతుంది.