యోగీ సర్కార్ నిర్ణయం.. ఇక నుంచి ‘ రాంజీ అంబేద్కర్ ’ - MicTv.in - Telugu News
mictv telugu

యోగీ సర్కార్ నిర్ణయం.. ఇక నుంచి ‘ రాంజీ అంబేద్కర్ ’

March 29, 2018

యోగీ సర్కార్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత భీమ్‌రావ్ అంబేద్కర్ పేరును మార్చాలని, అధికారిక పత్రాల్లో ఇక నుంచి అంబేద్కర్‌ను కొత్త పేరుతో పిలువాలని నిర్ణయం తీసుకుంది.  అంబేద్కర్ పేరుకు ముందు రాంజీ అని కలుపుతూ ఇకనుండి యూపీ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్‌ను ‘ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ ’ అని తమ అధికార పత్రాల్లో రాయనున్నది. యూపీ గవర్నర్ రామ్ నాయక్ ప్రతిపాదనల మేరకు ఈ మార్పును చేశారు. అయితే ఈ మార్పును సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా ఖండించింది. అంబేద్కర్ విధానాలను బీజేపీ గౌరవించదని ఎస్పీ నేత దీపక్ మిశ్రా విమర్శించారు.దళిత నేత పేరును యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అంబేద్కర్‌కు తాము వ్యతిరేకం కాదన్న నినాదాన్ని వినిపించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు.