రూ.40కే భోజనం హోం డెలివరీ

ఆహార పదార్థాల విక్రయంలో బిగ్ బజార్ సంస్థ మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు నిత్యావసరాలు, అతి సులభంగా వండుకుని తినే వీలున్న పదార్థాలను విక్రయిస్తున్న బిగ్ బజార్. ఇకపై అన్నం, కూరలూ వంటి ఆహారపదార్థాలను కూడా  అమ్మనుంది. ఆహార వ్యాపారాన్ని పెంపొందించడంలో భాగంగా ‘ఆహార పదార్థాల’ విక్రయంలోకి ప్రవేశిస్తున్నట్లు ఫ్యూచర్‌గ్రూప్‌ సీఈఓ కిశోర్‌ బియానీ వెల్లడించారు. క్లౌడ్‌ కిచెన్‌ నుంచి వీటిని వినియోగదారులకు అందుబాటు ధరలలో సరఫరా చేస్తామన్నారు. తమ డిజిటల్‌ వాలెట్‌ ఫ్యూచర్‌పే కార్యకలాపాల విస్తరణలో భాగంగా, అందుబాటు ధరలో ఆహార పదార్థాలను డోర్ డెలివరీ చేస్తామని వివరించారు. ‘తినడానికి సిద్ధంగా ఉండే ఆహారాన్ని వినియోగదారుల ఇళ్లకు రూ.40కే సరఫరా చేయాలన్నది మా ప్రయత్నం. ఇందుకోసం క్లౌడ్‌ కిచెన్‌ ఉపయోగించుకుంటాం. ఈ ప్రాజెక్టును సాకారం చేయడంపై దృష్టి పెట్టాం’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన బియానీ మీడియాకు వెల్లడించారు. ‘ప్రతి నగరంలో ఉండే వంటశాలల్లో తయారైన తాజా ఆహార పదార్థాలను, నేరుగా ఇళ్లకు సరఫరా చేయాలన్నది ప్రణాళిక. స్థానిక అవసరాలకు అనుగుణమైన ఆహారాన్నే సిద్ధం చేస్తాం’అని బియానీ తెలిపారు.Telugu News Future Group to diversify into cloud kitchen business‘వివిధ నగరాలలో నెలకొల్పే వంటశాలల్లో ఆహార పదార్థాలను వండి, ప్యాక్‌ చేసి, ఇళ్లకు పంపుతారు. అయితే ఈ వంటగదుల వద్ద  వీలుండద’ని తెలిపారు. కేంద్రీకృత వంటశాలలు అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పిన బియానీ, ఎన్ని నెలకొల్పుతున్నారు, ఇళ్లకు చేరవేసేందుకు ఏ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటారనే విషయాలు తెలిపేందుకు నిరాకరించారు. ‘బియ్యంతో తయారు చేసే భోజనాన్ని సిద్ధం చేస్తాం. ఇదే సమయంలో రూ.10కి 2 సమోసాలు కూడా పొందొచ్చు’ అని తెలిపారు. ఆహార పదార్థాలను ఇళ్లకే చేరవేసేందుకు, ఫ్యూచర్‌పే యాప్‌ను వినియోగించుకుని, తథాస్తు డిజిటల్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టాలన్నది గ్రూప్‌ ప్రణాళికగా కిశోర్‌ బియానీ వెల్లడించారు. ‘ఈ ప్రాజెక్టుపై పెద్దఎత్తున ఆశావహంగా ఉన్నాం. అందుబాటు ధర కనుక, తక్కువ మార్జిన్‌ ఉన్నా, వినియోగదారులకు సంతృప్తికరంగా అందించేందుకు, తమ సంస్థ నెట్‌వర్క్‌ను సమర్థంగా వాడుకుంటాం’ అని తెలిపారు.