వారెవ్వ సూశిన్రా కూరగాయల కుప్ప. ఖమ్మంలున్న రైతు బజార్ ముంగట ఉన్నది గీ కూరగాయల కుప్ప. తమాటలు, మిరపకాయలు, బెండకాయలు.. అన్ని కూరగాయలు ఉన్నయ్ ఈ రాశిల. కనీ ఇది అమ్మెదానికి తెచ్చిన కూరగాయలు అనుకునెరు కాదు, కుళ్లిపోయిన కూరగాయలు. అమ్మంగ మిగిలిపోయినయ్, కరాబయినై.. రోజూ ఇంటికివోయేటప్పుడు ఇట్ల పారవోశిపోయిన్రు రైతులు. ఇగ అవి కుళ్ళిపోయి కంపు కొడుతున్నయ్, అటుపక్క వచ్చినోళ్లంత ముక్కు మూసుకొని పోతున్నరుగనీ , పట్టించుకునే నాథుడే లేడట. ఇగ మున్సిపాలిటీ వాళ్లకు ఫిర్యాదు జేస్తే, వాళ్లేమో చెవిటోని ముందు శంఖం ఊదినట్టే జేస్తున్నరట. ఈ చెత్తతోని ట్రాఫిక్కు కూడా తిప్పలైతుందట. మరి పబ్లిక్ ఇంత తిప్పలైతున్నా, నిమ్మకు నిరెత్తినట్లు జేస్తున్న ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ వాళ్లకు సన్మానం జెయ్యాలే అని కోరుకుంటున్నరు ఖమ్మం పబ్లిక్.