mictv telugu

క్రికెట్‌కు గౌతమ్ గంభీర్ శాశ్వత వీడ్కోలు

December 4, 2018

మరో భారత స్టార్ క్రికెటర్.. మైదానానికికి శాశ్వత వీడ్కోలు పలికాడు. సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అనూహ్యంగా అన్ని ఫార్మాట్ల ఆట నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న గభీర్.. కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ లీగ్ల్లోనే ఆడుతున్నాడు. తాజాగా  అన్ని ఫార్మట్ల క్రికెట్కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్వీట్ చేశాడు. ఢిల్లీలో గురువారం రంజీ ట్రోఫీలో భాగంగా జరిగే ఢిల్లీఆంధ్రా మ్యాచ్ అతనికి చివరి మ్యాచ్ కానుంది. గంభీర్ 2016లో ఇంగ్లండ్తో చివరి టెస్ట్ ఆడాడు. చివరి వన్డేను 2013లో  అదే దేశంతోనే ఆడాడు.

37 ఏళ్ల గంభీర్ 2011 ప్రపంచకప్ ఫైనల్లో 97 పరుగులు చేసి భారత్ విజయ సాధించడానికి తోడ్పడ్డాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో ఆడాడు.  అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడు ఇప్పటివరకు మన దేశం తరఫున 58 టెస్ట్లు, 147 వన్డేలు, 37 టీ20ల్లో పాల్గొన్నాడు. కొంతకాలంగా అతని ఆటతీరు సరిగ్గా లేదు. ఐపీఎల్ సీజన్లలో మెప్పించకపోవడంతో ఈ సీజన్లో చోటు దక్కలేదు.

Telugu news  Gautam Gambhir Announces Retirement From All Forms Of Cricket  Gautam Gambhir represented India in 58 Tests, 147 ODIs and 37 T20Is