లారీని గుద్దేసిన గౌతమ్  మీనన్ కారు - MicTv.in - Telugu News
mictv telugu

లారీని గుద్దేసిన గౌతమ్  మీనన్ కారు

December 7, 2017

ఏ మాయ చేశావే ’ సినిమా దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కారు ప్రమాదానికి గురైంది. స్వల్ప గాయాలతో త్రుటిలో ప్రాణాలు కాపాడుకున్నారు. చెన్నై ఈస్ట్‌కోస్ట్ రోడ్‌లో గురువారం తెల్లవారు జామున 3:30 నుండి 4:00 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మీనన్ ప్రయాణిస్తున్న కారులో అతడు,  డ్రైవర్  మాత్రమే వున్నారు. వేగంగా వెళ్తూ లారీని డీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బ తిన్నది. డ్రైవర్‌కి, తనకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా లారీ డ్రైవర్ పరారీలో వున్నాడట. లారీ డ్రైవర్‌పై గ్యుండీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదిలా వుండగా కారు డ్రైవర్, గౌతమ్ మీనన్ మద్యం సేవించారని వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు.

వారు మద్యం సేవించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ చియాన్ విక్రమ్‌తో ‘ నక్షత్రం ’ సినిమా చేస్తున్నారు.