పార్లమెంట్‌లో  గే మంత్రి పెళ్లి ప్రపోజల్ - MicTv.in - Telugu News
mictv telugu

పార్లమెంట్‌లో  గే మంత్రి పెళ్లి ప్రపోజల్

December 4, 2017

ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లో గే మంత్రి “నన్ను పెళ్లి చేసుకుంటావా” అని మరో గే కి ప్రపోస్ చేసిన సంఘటన.. మొట్టమొదటి గే ప్రపోసల్ గా చరిత్ర కెక్కింది. ఇది స్వలింగ సంపర్కుల   బిల్లుని  ఆస్ట్రేలియా పార్లిమెంట్ హౌస్ ఆమోదం తెలిపిన తర్వాత  జరిగింది.  టిమ్ విల్సన్ 9 ఏళ్ళుగా ర్యాన్ బోల్గేర్‌తో ప్రేమలో వున్నాడు.

‘మన ప్రేమకు చిహ్నంగా మన వేళ్ళకు ఉన్న ఉంగరాలు మన అనుబంధాన్ని తెలుపుతాయి. ర్యాన్ బోల్గేర్ నన్ను పెళ్లి  చేసుకుంటావా?” అని పార్లమెంటు సాక్షిగా మంత్రి  ప్రపోస్ చేయగా..  అందుకు  ఆ గే నుండి సమాధానం ఔనని రావడంతో మంత్రి టీమ్ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. దానికి ప్రతిగా స్పీకర్ రికార్డు‌లో నోట్ చేసుకుంటూ “అవును” అని బిగ్గరగా చెప్పడంతో హౌస్ మొత్తం చప్పట్లతో మారు మ్రోగిపోయింది.

టిమ్ తర్వాత తన అనుభవాల్ని హౌస్ లో పoచుకుంటూ ..బోల్గేర్ తో తన అనుబంధాన్ని మిత్రులతో చెప్పినప్పుడు,వాళ్ళ నిశ్శబ్ధాన్ని,ఎంగేజ్మేంట్ పార్టీ కి పిలిస్తే ఎందుకు దీన్ని అంతగా పట్టించుకోవడం అన్నట్టు చూసారని.. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ప్రజలు దీనికి సమాధానాన్ని ఇచ్చారని గద్గద స్వరంతో చెప్పాడు.

ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్న చర్చకు కొనసాగింపుగా ఈ మధ్యనే ఆస్ట్రేలియన్లు పోస్టల్ వోట్ ద్వారా రికార్డు స్థాయిలో 62 శాతం మెజారిటీతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఇందులో 12.7 మిలియన్ వోటర్లు పాల్గొనడం విశేషం. ఇది ఇప్పుడు సేనేట్ ఆమోదం తో చట్టంగా రూపొంది ప్రపంచ వ్యాప్తంగా వున్న స్వలింగ సంపర్కుల హక్కులని  తెరపైకి తెచ్చిoది