అధ:పాతాళంలో గీతాంజలి రత్నాలు - MicTv.in - Telugu News
mictv telugu

అధ:పాతాళంలో గీతాంజలి రత్నాలు

February 22, 2018

బ్యాంకులను ముంచి  ఓనర్  దర్జాగా విదేశాల్లో తిరుగుతున్నాడు.  అతని ఆధీనంలో ఉన్న గీతాంజలి  రత్నాలకేమో గిరాకీ లేకుండా పోయింది.  పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పంగనామం పెట్టి   విదేశాలకు తుర్రుమన్న  నీరవ్ మోదీ వ్యాపారాలు ఒక్కొక్కటిగా పతన దారిలో పయనమవుతున్నాయి. నీరవ్ మోదీకి చెందిన గీతాంజలి జెమ్స్‌పై  సీబీఐ, ఈడీ  మూకుమ్మడిగా దాడి చేశాయి.గీతాంజలి జెమ్స్‌కు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ సీజ్ చేసింది. దీనితో గీతాంజలి జెమ్స్ షేర్ విలువ  క్యాండిల్ కరిగినట్లు కరిగిపోతోంది. గీతాంజలి జెమ్స్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌  కూడా ఒక్కసారిగా రూ.435.41 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. అంతేకాదు  ఈడీ అధికారులు గీతాంజలి జెమ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వార్నింగ్  లెటర్స్ పంపారు.  ఇప్పటికే  నీరవ్ మోదీ తన కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు కూడా వేరే ఉద్యోగాలు చూసుకోవాలని  స్పష్టం చేసిన విషయం తెలిసిందే.