mictv telugu

ఊరట.. అంగస్తంభనకు దారితీసే జన్యువు గుర్తింపు..

January 26, 2019

శృంగార సమస్యలకు పరిష్కారం దిశగా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. పురుషుల్లో అంగస్తంభన సమస్యకు కారణమయ్యే జన్యువును గుర్తించారు.  సిమ్1గా వ్యవహరించే ఈ జన్యువును అణచడం ద్వారా అంగస్తంభనను మెరుగుపరచవచ్చని చెబుతున్నారు.Telugu news  Genetic variation in the SIM1 locus is associated with erectile dysfunctionమన ఆలోచనలకు మెదడు కీలకమన్న సంగతి తెలిసిందే. సెక్స్ ప్రక్రియ కూడా మెదడులోనే మొదలవుతుంది. అంగం తగినంతగా స్తంభించకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. 30 శాతం కారణాలు జన్యుపరమైనవే. అయితే ఏ జన్యువులు, సంక్లిష్టమైన వాటి పనితీరు దీనికి కారణమో కనుక్కోవడం సంక్లిష్టంగా మారింది. సిమ్1 జన్యువును గుర్తించడం ద్వారా జన్యుపరమైన చికిత్సతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామనే ఆశ కలిగిందని పరిశోధనలో పాల్గొన్న అమెరికా శాస్త్రవేత్త ఎరిక్ జోర్గనన్సన్ పేర్కొన్నారు. ‘6 క్రోమోజోమ్‌పై సిమ్1 అనే బహురూప కణాన్ని గుర్తించాం. డీఎన్ఏలోని నూక్లియస్ ఆసిడ్ కు చెందిన థైమేన్ ఆ ప్రాంతంలో పెరగడం వల్ల అంగం 25 శాతం తక్కువ స్తంభిస్తున్నట్లు తేలింది. దీనితోపాటు స్థూలకాయం, ధూమపానం, మద్యపానం, గుండె జబ్బులు వంటి ఇతర సమస్యలు కూడా కారణం కావచ్చు. అయితే సిమ్1 గుర్తింపు ద్వారా ఒక స్పష్టత వచ్చింది..’ అని వెల్లడించారు.Telugu news  Genetic variation in the SIM1 locus is associated with erectile dysfunction