హైదరాబాద్ సదస్సుకు అరుదైన అతిథి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ సదస్సుకు అరుదైన అతిథి

November 20, 2017

నవంబర్ 28న హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో ట్రంప్ బిడ్డ ఇవాంకా మరియు ఆస్ట్రేలియాకు చెందిన పన్నేండేళ్ల కుర్రాడు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాడు. తన తండ్రికి రాజకీయాలలో సలహాలు ఇస్తూ అమెరికా ప్రభుత్వ సలహాదారురాలిగా ఇవాంకా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెతో పాటు సదస్సులో పాల్గొంటున్న ఆస్ట్రేలియా విద్యార్థి హమీష్ ఫిన్‌లేసన్ అనే పన్నేండేళ్ల కుర్రాడు ఘనత గురించి చెప్పుకోవాలి. అతి చిన్న వయసులో ప్రజలకు ఉపయోగపడే 5 యాప్‌లను తయారుచేసి ఆపిల్, ఫేస్‌బుక్ దృష్టిలో పడ్డాడు. విద్యార్థి హమీష్‌  రూపొందించిన ఐదు యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

దాదాపు 54 దేశాల్లోని ప్రజలు ఆ కుర్రాడు తయారుచేసిన  యాప్‌లను వినియోగిస్తున్నారంటే అర్థం చేసుకోండి కుర్రాడి ప్రతిభేమిటో. కాలుష్యం, వ్యర్థాలను రహదారులపై పారబోయడం వల్ల జరిగే అనర్థాలపై పదేళ్ల వయసులో హమీష్  తయారు చేసిన ‘లిట్టర్‌ బగ్‌ స్మాష్‌’ అనే యాప్ రూపొందిన ఈ యాప్‌కు పర్యావరణ ఎక్స్‌లెన్స్‌, ఆస్ట్రేలియాడే అవార్డు దక్కింది. మానసిక వైకల్యం(ఆటిజం)తో బాధపడే వారికోసం ‘ట్రిపుల్‌టీ అండ్‌ ఏఎస్‌డీ’ అనే యాప్‌కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. యాప్‌లను మరింత అభివృద్ధి చేసుకునేందుకుగాను అన్నిరకాలుగా ప్రోత్సాహం అందిస్తామని  ఫేస్‌బుక్‌, యాపిల్‌ సంస్థలు ఆ బాలుడికి ప్రోత్సాహాన్నిచ్చాయి. మరి హైద్రాబాద్‌లో జరిగే  పారిశ్రామిక సదస్సులో తన అభిప్రాయాలను మిగతా వారితో పంచుకునేందుకు స్కూల్‌కు సెలవు పెట్టి మరీ వస్తున్నాడట ఈ ఆస్ట్రేలియా కుర్రోడు.