పార్కులో కక్కుర్తి పడ్డారు.. జనం పెళ్లి చేసి పడేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

పార్కులో కక్కుర్తి పడ్డారు.. జనం పెళ్లి చేసి పడేశారు..

December 15, 2017

‘మేం ఎటూ ప్రేమికులమే.. మా ఇష్టమొచ్చిన రీతిలో వుంటాం.. చుట్టూ సమాజంతో మాకేం పట్టింపు లేదు కాబట్టి మాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాం’ అని పట్టపగలే పార్కులో బరితెగించిన  ఓ ప్రేమజంటకు పోలీసులు పెళ్ళి చేసిపారేశారు.  ఇప్పుడు  మీ ఇష్టమొచ్చిన ఆటను నాలుగు గోడల మధ్య ఆడుకోండని చెప్పేశారు.

ఈ ఘటన వారణాసి సమీపంలోని బదౌరాలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన యుగల్ బిహారీ ప్రజాపతి ( 25 ), రీనా ప్రజాపతి ( 23 ) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరిద్దరు వారణాసికి వచ్చారు. అక్కడ కొన్ని ప్రదేశాలను ప్రేమపక్షులై సందర్శించారు. ఆపై బదౌరాలోని ఓ పార్కుకు వెళ్ళారు.అప్పటికే ఆ పార్కులో చాలా మంది వున్నారు. వీళ్ళు కాసేపు పార్కులో కబూర్లు చెప్పుకున్నారు. ఐస్‌క్రీములు, పల్లీలు తిన్నారు. అలా సాగుతూ వచ్చిన వారి ముచ్చట్లకు ముద్దులు కలిపారు. అక్కడితో ఆగకుండా మోహంలోకి దిగారు. పార్కులోని చుట్టూ జనాలకు అసభ్యకరంగా కనిపించసాగారు. ప్రేమమైకంలో వున్న వారికి కళ్ళు కూడా కనిపించవంటారు ఇందుకేనేమో అనుకున్న స్థానికులు సిగ్గుతో తలలు దించుకున్నారు. అక్కడ తమ పిల్లలెవరైనా వుంటే వాళ్ళ కళ్లు మూసేశారు. ఆ ప్రేమికుల వలపు మోహంలో నిండా మునిగిపోయారు చుట్టూ ప్రపంచంతో పని లేనట్టుగా. శృతి మించుతున్న వారి వికృతాన్ని ఇక ఆపాలనుకున్నారంతా.

వెంటనే పోలీసులకు పోన్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒకరంటే మరొకరికి ఇష్టమని, రెండేళ్లుగా ప్రేమించుకున్నామని చెప్పారు. దీంతో యుగల్, రీనా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడి వీరి పెళ్లికి ఒప్పించారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన పోలీసులు అదేరోజు ఈ ప్రేమజంటకు వివాహం జరిపించారు. వధువుకు కట్నకానుకలు అనే సమస్య లేకుండానే వివాహం జరిపించామని అనిల్ కుమార్ సింగ్ తెలిపారు.

కాగా తమ ఆకస్మిక పెళ్ళికి ఇద్దరు వధూవరులు హర్షం వ్యక్తం చేయటం గమనార్హం. యుగల్ మాట్లాడుతూ ‘ నేను ముంబైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. వచ్చే ఏడాది తాము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అంతకు ముందే మాకు పెళ్ళి చేసిన పోలీసులకు ధన్యవాదాలు. మాకు చాలా ఆనందంగా వుందని ’ పొంగిపోయాడు. వధువు కూడా ఆనందించింది.