చనిపోతే  ధూం ధాం దావత్, పండుగ ! - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోతే  ధూం ధాం దావత్, పండుగ !

March 7, 2018

ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే  వారితో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ శోక సముద్రంలో మునిగిపోతాం కదా. మనకు తెలియని వాళ్లు చనిపోయినా అయ్యో పాపం అని అంటాం. కానీ ఘనా దేశంలో మాత్రం కుటుంబ సభ్యులు చనిపోతే బంధువులందరిని పిలిచి పండగ జరుపుకుంటారు. కొత్త దుస్తులు వేసుకుని అందరూ ఆనందంగా పార్టీ చేసుకుంటూ  ఎంజాయ్ చేస్తారు. నిగ్రో జాతీయులుగా పిలవబడే అక్కడి మనుష్యులకు ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారమట.కుటుంబ సభ్యులు మాత్రం చనిపోయిన వారి ఫోటో కలిగిన టీషర్టులను ధరిస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం పాటించడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు అక్కడి ప్రజలు. పోయిన వాళ్లతో మనం పోలేం కదా మనకూ ఎప్పుడో ఒకప్పుడు చావు వస్తుంది దాని గురించి బాధ పడడం ఎందుకు అని వాళ్ల  అభిప్రాయం