గిఫ్ట్‌లో బాంబు పెట్టారు.. వరుడ్ని బలిగొన్నారు - MicTv.in - Telugu News
mictv telugu

గిఫ్ట్‌లో బాంబు పెట్టారు.. వరుడ్ని బలిగొన్నారు

February 24, 2018

ప్రమాదాలు ఏ రూపంలో పొంచి వస్తున్నాయో అంచనా వెయ్యటం ఎవరి తరమూ కావటం లేదు. పాత కక్ష్యలో, మరే కారణాలో గానీ అప్పుడే పెళ్ళైన వరుడి ప్రాణాలు బలిగొన్నారెవరో అగంతకులు. అది కూడా బహుమతి రూపంలో అతని మృతిని బలిగా తీసుకున్నారు. గిఫ్ట్‌లో డబ్బులో, వస్తువులో, బంగారు ఆభరణాలో ఇస్తారు కానీ ఓ వ్యక్తి మాత్రం గిఫ్ట్‌లో బాంబ్ పెట్టాడు. ఈ ఘటన ఒడిశాలోని బోలన్‌గిర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ జంటకు ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. ఈ నెల 21న రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

విందుకు చాలా మంది బంధువుల, స్నేహితులు వచ్చారు. అందులో ఓ వ్యక్తి గిఫ్ట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు. ఇంటికెళ్ళాక గిఫ్టులు విప్పే పనిలో వరుడు, నానమ్మ వున్నారు. ఓ గిఫ్ట్ ప్యాక్ విప్పగానే అందులో వున్న బాంబ్ పేలింది. అంతే వరుడు, నానమ్మ అక్కడే తీవ్ర గాయాలతో కుప్ప కూలారు. వెంటనే ఆసుపత్రకి తరలించారు.

వరుడు, నానమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వధువు చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రిసెప్షన్‌లో తీసిన వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఎవరో తెలిసిన వాళ్ళే ఈ పని అయుంటుందని.. కాకపోతే అగంతకుడి టార్గెట్ వరుడా ? వధువా అన్న కోణంలో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.