వచ్చే ఏడాది ధరల మోతకు సిద్ధమవుతున్న జియో - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చే ఏడాది ధరల మోతకు సిద్ధమవుతున్న జియో

December 11, 2017

వచ్చే ఏడాది జియో తన ఆఫర్ల సహృదయతకు మంగళం పాడనున్నది. ఉన్న రాయితీలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు లండన్‌కు చెందిన ‘ ఓపెన్ సిగ్నల్ ’ సర్వే సంస్థ తెలిపింది. గతేడాది 4జీ సేవలతో అతి తక్కువ ధరలతో వినియోగదారుల మతులు పోగొట్టిన జియో ఇక ఇచ్చిందంతా తిరిగి రప్పించుకునేందుకు వడ్డనలకు దిగనున్నది.

చ్చే ఏడాది ఏప్రిల్‌తో జియో ప్రైమ్ సభ్యుల సభ్యత్వం ముగుస్తుంది. కాబట్టి చవక సేవలు లభించాలంటే రెన్యువల్ చేసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం జియో ఆఫర్ చేస్తున్న టారిఫ్ ప్లాన్ల ధరలు వచ్చే ఏడాది పెంచడం ఖాయమని ‘ ఓపెన్ సిగ్నల్ ’ వివరించింది.

జియో దెబ్బకు ఇతర నెట్‌వర్క్ కంపెనీలు సైతం తమ టారిఫ్ రేట్లను తగ్గించుకోవాల్సి వచ్చింది. అంతే కాదు, జియో రాకతో డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగింది. కాగా, దీపావళి నాడు కొన్ని పోస్టు పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను జియో పెంచింది. జియో ధరలు తగ్గిస్తే ఇతర నెట్‌వర్క్‌లు కూడా తమ టారీఫ్ ధరలు తగ్గించాయి. కాగా ఇప్పుడు మళ్ళీ జియో తన టారీఫ్ ధరలు పెంచితే ఇతర నెట్‌వర్క్‌లు కూడా ధరలు పెంచొచ్చు అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.