రష్యాలో ఓ ప్రియురాలు ‘ప్రేమికుల రోజు’ నాడు బాయ్‌ఫ్రెండ్‌కు ఎవ్వరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అది ఏంటంటే అతని మరణాన్నే అతనికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంది. ఆశతో ఇంటికి వస్తే అతని నుదిటిపై మరణశాసనం రాసింది. గర్ల ఫ్రెండ్ అనస్తేసియా ఒనేజినా(21) ..తన బాయ్ ఫ్రెండ్ డ్మిటీ సింకీచ్(24)ను వాలెంటైన్స్ డే రోజు ఇంటికి పిలిచింది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఆదమరిచి ఉన్నప్పుడు కిచెన్‌లోని కత్తితో అతనిని దారుణంగా హత్య చేసింది.ఆ తర్వాత అతని శరీర భాగాలను వేరు చేసి తల, కాళ్లు, చేతులు, మర్మాంగం, చెంపలను కవర్లలో వేసి ఫ్రిజ్‌లో దాచింది. ఈ హత్య గురించి పోలీసులు ఆరా తీశారు. ఆమె ఇంట్లో అతని శరీర భాగాలు ఒక్కొక్కటి భయటపడడం చూసిన పోలీసులకు ఒక్కసారిగా ‘రాంగ్ టర్న్’ సినిమా పార్ట్లన్ని కళ్లకు కట్టినట్టు కనిపించాయి. పోలీసులు వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. అయితే బాయ్ ప్రెండ్ ను ఇంత కిరాతకంగా ఎందుకు చంపిందో ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాదు ఆమెకు గతంలో ఇదివరకే పెళ్లి అయ్యింది. ఆమె భర్త కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరి భర్తను కూడా ఈమె హత్య చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.