మంచిపని కోసం అమ్మకానికి కన్యత్వం  - MicTv.in - Telugu News
mictv telugu

మంచిపని కోసం అమ్మకానికి కన్యత్వం 

September 9, 2017

ఉక్రెయిన్‌కు చెందిన 18 ఏళ్ల అందమైన అమ్మాయి యూలియా తన కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు స్థానిక పత్రిక ‘టార్బింకా’లో వాణిజ్య ప్రకటన ఇచ్చింది. అలారం గడియారాలు, పురాతన వస్తువులకు కొనుగోలుదారులు కావాలంటూ ఇచ్చిన ప్రకటన పక్కనే ఆ పత్రిక ఈ అమ్మాయి ప్రకటనను ప్రచురించింది. అమ్మాయిని గుర్తుపట్టకుండా కాస్త మెడ కింద నుంచి పెదవుల వరకు కనిపించేలా ఆమె ఫొటోను ప్రచురించింది.

‘నాకు బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నప్పటికీ ఇప్పటికీ కన్యగానే ఉండిపోయాను. ఎప్పుడో మద్యం పార్టీలో మత్తుగా తాగి కన్యత్వాన్ని కోల్పోవడం కన్నా ఓ మంచి కాజ్‌ కోసం కన్యత్వాన్ని కోల్పోవడం మంచిదని అనుకున్నాను. అందుకనే ఈ నిర్ణయానికి వచ్చాను. ఎవరైనా 1500 పౌండ్లకు కొనుక్కోవచ్చు. దీనికి పోటీ పడాల్సిన పనిలేదు. మగతనం ఉన్న పురుషుడైతే చాలు అనుమతిస్తా. లైంగిక పిచ్చి ఉన్నవాళ్లు తగుల కూడదని కోరుకుంటున్నా’ అని ఆ ప్రకటనలో ఆమె వివరించారు. అయితే మంచి కాజ్‌ కోసం అని చెప్పిన ఆమె, ఆ కాజ్‌ ఏమిటో వెల్లడించలేదు.

కన్యత్వం కోసం వచ్చే పురుషుడు తన వైద్యులతో పరీక్షించుకోవచ్చని కూడా యూలియా సూచించింది. ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకునేందుకు తన వెంట ఓ సహచరుడు వస్తారని, ఆయన డబ్బులు తీసుకెళ్లిన గంటలోగా సదరు పురుషుడి ముందు తాను కన్యత్వాన్ని సమర్పించుకునేందుకు సిద్ధంగా ఉంటానని తెలిపారు. అలా ఉండకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని కూడా చెప్పారు. అయితే తాను ఎంపిక చేసిన చోటనే తనను అనుభవించాలని ఆమె షరతు విధించారు. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం తమ పత్రికకు ఇదే మొదటిసారని, స్పందన ఎలా ఉంటుందో చూడాలని టార్బింకా పత్రికా యాజమాన్యం తెలిపింది. ఈ వార్త చదివాక ఇంకా ముందు ముందు ఎలాంటి ఎలాంటి వార్తలు పత్రికల్లో చదవాల్సి వస్తుందోనని అనుకుంటున్నారు కదూ.