ఛాన్సుల కోసం అమ్మాయిలను అంగడిబొమ్మల్లా మారుస్తున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

ఛాన్సుల కోసం అమ్మాయిలను అంగడిబొమ్మల్లా మారుస్తున్నారు

March 17, 2018

అవకాశాల మాటున అమ్మాయిలను అంగడి బొమ్మల్లా మారుస్తున్నారని, ప్రముఖ దర్శక నిర్మాతలు, టాప్ హీరోలు అని చెప్పుకునేవాళ్లకు సైతం ఇందులో హస్తం ఉందని నటి శ్రీరెడ్డి ఆరోపిస్తున్నారు.    ‘ అరవింద్ 2 ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమపై చేస్తున్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అవకాశాల కోసం ఓ బడా నిర్మాత కొడుకుతో తాను ప్రేమ వ్యవహారం నడపాల్సి వచ్చిందని మరో సంచలన విషయం చెప్పారు. అతనితో చనువుగా వుంటే వాళ్ళ ప్రొడక్షన్‌లో వచ్చే సినిమాల్లో తనకు అవకాశాలు వస్తాయని అనుకున్నానని.. కానీ ఎలాంటి అవకాశాలు రాలేవని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపింది.అయితే సదరు నిర్మాత కొడుకు ఎవరన్నది మాత్రం ఆమె బయటపెట్టలేదు. అయితే ఆమె బడా నిర్మాత అంటూ క్లూ ఇవ్వడంతో.. ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతల పేర్ల చుట్టూ ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అగ్ర దర్శకులు, నిర్మాతలు అని చెప్పుకునే కొంతమంది ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

ఇండస్ట్రీలో అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలపై తాను పోరాడతానని వెల్లడించారు. పరిశ్రమలో జరుగుతున్న రాసలీలలకు పెద్ద హీరోలు, హీరోయిన్లు మినహాయింపు కాదని తెలపింది. కొంతమంది పెద్ద హీరోలు తమ అవసరాల కోసం రాజకీయ నాయకుల వద్దకు టాప్ హీరోయిన్లను పంపిస్తుంటారని బాంబు పేల్చారు. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లకు పనికిరారంటూ ఉత్తరాది అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకుంటున్నారు, ఈ దురాచారం ఆగాలని అన్నారు. కాస్టింగ్‌కౌచ్ అనే దౌర్భాగ్యస్థితి నుంచి అమ్మాయిలు రక్షించబడాలని అన్నారు. మేనేజర్లు, కోఆర్డినేటర్లు సినిమా పరిశ్రమకు వస్తున్న అమ్మాయిలకు అవకాశాల ఎరజూపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పారు.