కనపడకుండా పోయిన కాలేజీ విద్యార్థులు ! - MicTv.in - Telugu News
mictv telugu

కనపడకుండా పోయిన కాలేజీ విద్యార్థులు !

February 10, 2018

ఆ ఇద్దరు అమ్మాయిలు రోజు లాగే ఆరోజు కాలేజీకి వెళ్లారు.  లెక్చరర్లు చెప్పిన పాఠాలు విన్నారు. కానీ సాయంత్రం ఇంటికి మాత్రం వెళ్లలేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్లారు? లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా? నారాయణగూడకు చెందిన చామంత్రి(18),దివ్య(20) అనే ఇద్దరు విద్యార్థులు రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. శుక్రవారం రోజు కాలేజీకి వెళ్లి  రాత్రి గడిచినా కూడా ఇంటికి వెళ్లలేదు. వారి గురించి ఆరా తీసిన వాళ్ల తల్లిదండ్రులు  కాలేజీ యాజమాన్యానికి తెలియ జేశారు.దీనితో కాలేజీ యాజమాన్యం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాలేజీకని వెళ్లిన మా పిల్లలు ఎక్కడికి వెళ్లారు? అని ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఇంతకీ వారిద్దరూ కలిసి ఎటైనా వెళ్లారా? లేక గిట్టని వాళ్లు ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది.