mictv telugu

ఊరెళ్తే మాకు సమాచారం ఇవ్వండి…

January 10, 2019

సంక్రాంతి పండగ సందర్భంగా దోపిడీ దొంగలకు చేతినిండా పనే. అందరూ ఊళ్ళకు వెళ్తారు కాబట్టి దీన్ని మించిన అవకాశం వాళ్ళకు వేరేది వుండదేమో. ఇప్పటికే చెడ్డీగ్యాంగ్ వంటి దొంగల ముఠాలు హైదరాబాద్‌లో తిష్ఠ వేశాయి. అయితే అలాంటి అవకాశం దొంగలకు ఇవ్వకండి అంటున్నారు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌. పండగ సందర్భంగా ఊళ్లకు వెళ్లేవాళ్ళు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతంలో దోపిడీలు జరిగినట్టుగా ఇప్పుడు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. పండగ సందర్భంగా నగరం, శివార్లలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అంతర్రాష్ట్ర ముఠాలు చోరీలకు పాల్పడుతున్నాయన్నారు.Telugu news Give us information if you go village …ఊళ్లకు వెళ్లేవారు సంబంధిత సెక్టార్‌ ఎస్సైకి సమాచారం అందివ్వాలని చెప్పారు. దీంతో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ పెంచడంతో పాటు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పి వెళ్తే మరీ మంచిదన్నారు. జోనల్‌ కంట్రోల్‌ రూంలు… హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరాలను నియంత్రించేందుకు జోనల్‌ కంట్రోల్‌ రూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.

చైన్ స్నాచింగ్‌లు అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి…

చైన్ స్నాచింగ్ కట్టడికి, దొంగతనాలు అరికట్టేందుకు అవసరమైన ప్రత్యేక డ్రైవ్‌ చర్యలు చేపట్టామని తెలిపారు. గతేడాది 30శాతం స్నాచింగ్‌ కేసులు తగ్గాయని అన్నారు. మళ్లీ చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్న దృష్ట్యా నేరగాళ్ల ఆటకట్టించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభిస్తామని తెలిపారు. 11 చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డ దొంగలను సీసీ కెమెరాల ఫుటేజీతోనే పట్టుకున్నామన్నారు.