ముదురుతున్న ఎండలు - MicTv.in - Telugu News
mictv telugu

ముదురుతున్న ఎండలు

February 24, 2018

శివశివా అని శీతాకాలం అలా టాటా చెప్పిందో లేదో ఢించక్ ఢించక్ అంటూ వేసవి కాలం వచ్చేసింది. రావటం రావటమే సూర్యుడు మండిపోతున్నాడు. మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు మితిమీరిపోతున్నాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇప్పుడే ఎండలు ముదరు దశలో వుంటే ఇంకా మున్ముందు ఎండలు ఎంతగా మండిపోతాయోనని పరేషాన్ అవుతున్నారు. ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వేసవి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.